నమస్తే శేరిలింగంపల్లి: సమాజంలో తోటి వ్యక్తులకు ఆపద వచ్చినప్పుడు.. తోడున్నామనే ధైర్యాన్నివ్వాలని జనసేన శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇన్ ఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి అన్నారు. హఫీజ్ పేట డివిజన్ పరిధి ఇంద్రా రెడ్డి కాలనీలోని, జన సేన పార్టీ కార్యకర్త ఎదురుగట్ల రాజేష్ గౌడ్ నివాసంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించింది.
ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న జనసేన శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇన్ ఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. తమ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుందనే మనో ధైర్యాన్నిచ్చారు. ఇంట్లో వస్తువులంతా కాలిపోవటం చూశారు… ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ‘రాజేష్ గౌడ్ ‘ కుటుంబానికి ఆర్థిక సాయం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళా నాగలక్ష్మి, నాయకులు అరుణ్, కళ్యాణ్ చక్రవర్తి, హనుమంత్ నాయక్ , ఉపేంద్ర, శివ, అభిరాం, సాజిత్, గాంధీ, రఘు, సాయి, కిషోర్, సాంబ, సంతోష్, పాల్గొన్నారు.