శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని BK ఎనక్లేవ్ కాలనీలో KK డిజిటల్ ఆద్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, బలగం మూవీ ఫేమ్ సంజయ్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ముగ్గులను తిలకించి మహిళలను అభినదించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , చంద్రిక ప్రసాద్ గౌడ్, నరేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సుప్రజ, నరేష్ ,శివ ,శ్రీకాంత్ రెడ్డి, వెంకటేష్, చందు, కల్పన,లత, లక్ష్మీ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.