శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): వైకుంఠ ఏకాదశి పర్వదినంను పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని బికే ఎనక్లేవ్ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారిని స్థానిక నాయకులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి , ప్రతాప్ రెడ్డి సాయికృష్ణ, స్వామి నాయుడు, తిరుపతి నాయుడు, భూపాల్ రెడ్డి గంగిరెడ్డి, కృష్ణ రావు సదానందం, శ్రీకాంత్ రెడ్డి , వెంకటేశ్వర్లు, జనార్ధన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.