శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో మంజీరా పైప్ లైన్ లీకేజ్ మరమ్మత్తు పనులను వాటర్ వర్క్స్ DGM వెంకటేశ్వర్లుతో కలసి కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీలో మంజీరా పైప్ లైన్ లీకేజీ మరమ్మత్తు పనులను వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పరిశీలించి సమస్యను పరిష్కరించడం జరిగినదని, మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో మంచి నీటి సరఫరాకు ఆటంకం కలగకూడదని అధికారులకు సూచించారు, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కాలనీవాసులకు కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు సునీత, రమేష్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2025/01/10m-1024x570.jpeg)