శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): కానరి ద స్కూల్ లో సంక్రాంతి ముందస్తు సంబరాలను నిర్వహించారు. ప్రిన్సిపాల్ లిడియాక్రిస్టినా ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో విద్యార్థులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను విశిష్టతను వివరించారు. పాఠశాల ప్రాంగణంలో రంగవల్లులు వేసి, బొమ్మల కొలువు పెట్టి, వివిధ కళాకృతులతో అలంకరించారు. అనంతరం పాఠశాలలో భోగి మంటలు వేసి, హరిదాసు కీర్తనలతో, అంతా సుభిక్షంగా ఉండాలన్నదానికి సూచికగా పాలను పొంగిస్తూ సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల ఆట, పాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. మరికొందరు విద్యార్ధులు గాలిపటాలను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లిడియాక్రిస్టినా, హెడ్ సీనియర్ స్కూల్ డాక్టర్ నవీన్ కుమార్ ఇమ్మడి, కో ఆర్డినేటర్లు అపర్ణ, ముక్తా, ఎడ్మిన్ మేనేజర్ మహేష్ , ఇతర ఉపాధ్యాయులు చిన్నారులకు భోగి పళ్ళను పోసి వారి భవిష్యత్తు తేజోవంతంగా ఉండాలని ఆశీర్వదించారు.