శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ తారానగర్ పరిధిలోని విద్యానికేతన్ మోడల్ హైస్కూల్ లో విద్యార్థినులకు, అధ్యాపకురాళ్ళకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షులు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు అని అన్నారు. ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ పోటీలలో 30 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ కనకదుర్గ, అధ్యాపకురాలు సత్యవతి, కరస్పాండెంట్ రామాచారి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.