శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా టీమ్ హ్యుమానిటీ ఆధ్వర్యంలో కొండాపూర్ నారాయణ కాలేజీలో నిర్వహించిన జాతీయ యూత్ డే వేడుకల్లో ఫోరం ఫర్ ఐటీ అధ్యక్షుడు వినోద్ , ఆర్.ఎస్.ఎస్ విషయ సంపర్క్ ప్రచారక్ పాండే, బి.జే. వై.ఎమ్ స్టేట్ స్పోక్స్ పర్సన్ అమర్ యాదవ్ , నారాయణ కాలేజీ ఏజిఎం , అధ్యాపకులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులందరికి నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు తెలిపారు, మన దేశానికి యువత అమూల్యమైన సంపద అన్నారు. దేశ అభివృద్ధి లో కీలక పాత్ర యువతదే అని అన్నారు.
అతి చిన్న వయస్సులో 1893 లో స్వామి వివేకానంద పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ లో ప్రసంగించి మన దేశ సంస్కృతిని తత్వాన్ని ప్రవేశ పెట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన మనకు ఉపదేశించిన వాక్యాలు కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు, ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు, ఉక్కు సంకల్పం కలిగిన యువత, మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు..ఇలాంటి గొప్ప సూక్తులు ఇప్పటికీ స్ఫూర్తి ని అందిస్తూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు జై దేవ్, కృష్ణ, ధరణి, రవి,అభిషేక్ ,నాని, అఖిల్ , కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.