శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పండుగ వేళ ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్తున్న సందర్బంగా దొంగల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చందానగర్ పోలీసులు ప్రజలకుసూచించారు. సైబరాబాద్ కమిషనరేట్, మాదాపూర్ జోన్, చందానగర్ పోలీసులు ప్రజలు అప్రమత్తంగా, అవగాహనతో ఉండాలని తెలియజేసేందుకు గుడ్ సిటిజన్ అవార్డు గ్రహీత దొంతి సత్యనారాయణ గౌడ్, ఆయన కుమారుడు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొంతి కార్తీక్ గౌడ్‌ల ఆధ్వర్యంలో ఆటో ద్వారా ప్రచారం నిర్వహించారు. ఆటోకు జాగ్రత్తలు కలిగిన ఫ్లెక్సిలను, సౌండ్ బాక్సులను వారు తమ సొంత ఖర్చుతో అమర్చి చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు నివాసం ఉంటున్న వీధుల్లో, రద్దీ ప్రదేశాలలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చందానగర్ సి.ఐ. పాలవెళ్ళి, డి. ఐ. రవికుమార్ ఆదేశాల మేరకు ఎస్. ఐ. ఆంజనేయులు సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో చందానగర్ ఎస్. ఐ. అంజినేయులు, క్రైమ్ జందార్లు శ్రీనివాస్ రెడ్డి, సాదిక్ అలీ, పద్మనాథంలతోపాటు గుడ్ సిటిజన్ అవార్డు గ్రహీత దొంతి సత్యనారాయణ గౌడ్, ఆయన కుమారుడు శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దొంతి కార్తీక్ గౌడ్, ఆనంద్ గౌడ్, నరేష్ పాల్గొన్నారు.