నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతంలో ఆస్తి హక్కులను కల్పించడానికి GO NO . 58 & 59 ద్వారా అవకాశం కల్పించగా దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, పేదల కుటుంబాల్లో చిరునవ్వు కనబడుతున్నది ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూకట్ పల్లి డివిజన్ పరిధి పాపిరెడ్డినగర్ కాలనీలో 22 మంది లబ్దిదారులకు జీవో 59 కింద ఆస్తి హక్కులను కల్పిస్తూ.. కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉండేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు జీవో 58 ప్రకారం వారికి రెగ్యులరైజ్ చేసి జీవితంపై భరోసా కల్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రారెడ్డి , కాశినాథ్ యాదవ్, గుడ్ల శ్రీనివాస్, ఆర్ భగవంతు రెడ్డి, నరసింహులు ముదిరాజ్, సిహెచ్ రామకృష్ణారెడ్డి, ఎం కనక రెడ్డి, వీరభాస్కర్, శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, శ్రీహరి, మోహన్ , వి. ఆంజనేయులు పాల్గొన్నారు.