శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి మంజీరా డైమండ్ హైట్స్, మంజీరా పర్పుల్ టౌన్, మంజీరా డైమండ్ టవర్స్ గేటెడ్ కమ్యూనిటీలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సందర్శించారు. గేటెడ్ కమ్యూనిటీ వాసులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఎన్నాళ్లుగానో ఉన్న డ్రైనేజీకి అవుట్ లెట్ సమస్య, సీసీ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ లైన్ నిర్మాణం, మంజీరా డైమండ్ టవర్స్ బ్లాక్ సైడ్ గేట్ మూసివేయడం వల్ల రహదారి నిర్మానుషంగా ప్రాంతంగా మారిందని, దుష్ట తత్వాలు మద్యం సేవనానికి ఉపయోగిస్తున్నారని తెలియజేశారు. అనంతరం తమ కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
దీంతో అక్కడే ఉన్న అధికారులకు ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. డ్రైనేజీకి అవుట్ లెట్ ను ఏర్పాటుచేసి, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని, అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సీసీ రోడ్లు ప్రతిపాదనలు సిద్ధం కాగానే నిధులు మంజూరు చేయించి త్వరగా పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తామని తెలిపారు. స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం, పార్క్ అభివృద్ధి పనుల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రతిపాదనల ప్రకారం అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయించి ప్రజల కష్టాలను తొలగిస్తామని, కాలనీల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంజీర డైమండ్ టవర్స్ ప్రెసిడెంట్ ప్రసాద్ , సెక్రెటరీ శ్యామ్ ప్రదన్ , గేటెడ్ కమ్యూనిటీ వాసులు అతుల్, అంకుర్, నటేశాన్, గోవింద రాజు, సంతోష్, రజో, అన్షుమన్, సోమేష్, సీనియర్ నాయకులు సురేష్, రాజు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.