శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని సరస్వతి విద్యా మందిర్ 44వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, విశిష్ట అతిథిగా చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ రెడ్డి పాల్గొన్నారు. చదువులోనూ, ఆటపాటల్లోనూ ప్రధమ ద్వితీయ స్థానాలను పొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ముఖ్యఅతిథిగా సుప్రజా హోటల్ అధినేత టి సుభాష్ హాజరై గెలుపొందిన విద్యార్థులకు ప్రైజ్ లను అందజేశారు.
అలాగే ప్రముఖ సంఘ సేవకుడు రఘుపతి రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరై విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. విద్యార్థిని విద్యార్థులు నాట్య ప్రదర్శన, మోనో యాక్షన్ వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ తో ఆహ్వానితులందరినీ అలరింప చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన భారతి ప్రెసిడెంట్ రామ స్వామి, పాఠశాల సెక్రటరీ మూగల రఘునందన్ రెడ్డి, ట్రెజరర్ నాగభూషణ రావు, సహాయ కార్యదర్శి రామచంద్రారెడ్డి, సభ్యులు సుదీప్ రెడ్డి పాల్గొన్నారు.