శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి ప్రాజెక్ట్ CDPO గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా CDPO కవిత PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్ ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న పిల్లలకు ఉచితంగా ఏక రూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పిల్లలకు పౌష్టికాహారంను నిర్ణిత సమయంలో అందించాలని, చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, అన్ని రకాల వసతులు కల్పిస్తూ, చక్కటి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తూ చక్కటి విద్యను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్లు కోమలి, మాధురి, జ్యోతి, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.