శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): కెపిహెచ్‌బి 7 ఫేస్ ,4 ఫేస్ కాలనీ అఖిల భారత యాదవ మహాసభ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ కేపీహెచ్‌బీ యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ నాగరాజు యాదవ్, ఏ వెంకటేశ్వర్లు యాదవ్ రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, టి వెంకటయ్య యాదవ్ రిటైర్డ్ ఆర్మీ, డి రవి శంకర్ యాదవ్ ఎస్ వి కిరాణా స్టోర్స్ ప్రొప్రైటర్, బి గిరి యాదవ్ ధరణి ట్రావెల్స్ ప్రొప్రైటర్, ఎస్ వి రమణ యాదవ్ 114 వార్డు మెంబర్ బిల్డర్, ఏ రమణయ్య యాదవ్ పోస్టల్ డిపార్ట్మెంట్, యాదవ సంఘం సభ్యులు అందరూ ప్రతి ఏటా యాదవుల ఐక్యత కోసం యాదవ్ వనభోజనాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఐకమత్యమే మహాబలం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జోషి రాఘవేంద్ర శర్మ, ఆశయ్య గౌడ్, శంకర్ కురుమ, రఘు ముదిరాజ్, నాయి బ్రాహ్మణ నారాయణ, రజక సంఘం కిషోర్, యాదవ సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.