– కొత్త పాలకమండలి నేతృత్వంలో తొలి ఉత్సవాలు
– ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రజాప్రతినిధుల రాక
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ లోని శ్రీ తుల్జాభవాని ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు బాలత్రిపుర సుందరి స్వరూపంలో అలంకరింపబడిన అమ్మవారిని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దర్శించుకున్నారు. ఆలయంలో నూతన పాలకమండలి ఏర్పడిన తర్వాత తొలి ఉత్సవాల నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల బృందం పూర్ణకుంభంతో అరికెపూడి గాంధీ నాగేందర్ యాదవులకు స్వాగతం పలికారు. అనంతరం వారి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుల్జాభవాని అమ్మవారి ప్రాముఖ్యతను మరింతగా విస్తరించేలా కొత్త పాలకమండలి పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున శర్మ, ఆలయ ఈఓ విజయభారతి, కమిటీ సభ్యులు సంజీవరెడ్డి, రేణుక శ్రీనివాస్ గౌడ్, గోవింద్ చారి, సంపత్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్, డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, నాయకులు దాసరి గోపి, కిరణ్ యాదవ్, కృష్ణ యాదవ్, నటరాజ్ ,గోపి, జనార్దన్ గౌడ్, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.