శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ దివంగత ఇన్చార్జ్ కోండకల్ శంకర్ గౌడ్ సమీప బంధువు కలివేముల వీరేశం గౌడ్ శేరిలింగంపల్లిలోని ఏదైనా డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి శనివారం తన బయోడేటాను అందజేశారు. ఉద్యమకారుడైన తనకు అవకాశం ఇస్తే క్షేత్రస్థాయిలో పార్టీని బలపరుస్తానని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.సత్యనారాయణ గౌడ్, ఎన్ సంతోష్ రెడ్డి, కె.శ్రీనివాస్ గౌడ్, కె.పాండు, కె.సంతోష్ కుమార్, జాన్సన్ రాజు, ఆర్ ప్రదీప్ చారి, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, ఎన్ చారి, తదితరులు పాల్గొన్నారు.