ఆల్విన్‌కాలనీ(నమస్తే శేరిలింగంపల్లి): అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు ఆల్విన్‌కాలనీ డివిజన్ కార్పొరేటర్ శనివారం ఆర్థిక సహాయం అందించారు. కమలమ్మ కాలనీలో నివాసం ఉండే వీరబాబు (38) అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కార్పోరేటర్ వెంకటేష్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం రూ.5000ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజు పటేల్, ఉపాధ్యక్షులు డేవిడ్, ప్రధాన కార్యదర్శి గణేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్ , కోశాధికారి ఎం. వెంకటేష్ తదితరులు ఉన్నారు.