- చెక్కుల రూపేణా అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక.. బోనాల పర్వదినం సందర్భంగా పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని పలు దేవాలయాలకు రెండో విడుతలో రూ.1,90,000 మంజూరయ్యాయి. మంజూరైన నిధులను చెక్కుల రూపేణ దేవాలయాల కమిటీ ప్రతినిధులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక.. బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నామని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నానని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నియోజకవర్గం లోని ప్రతి గుడికి బోనాల నిధులు మంజూరయ్యేలా కృషి చేశానని తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరుచేయడం పట్ల సీఎం కెసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెలుతున్నారని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, ప్రసాద్, ఆంజనేయులు పాల్గొన్నారు.