నమస్తే శేరిలింగంపల్లి : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో సీనియర్ సిటిజన్స్ సంఘాల సమాఖ్య – కూకట్ పల్లి చాప్టర్ ఆధ్వర్యంలో ప్రపంచ పెద్దల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని వయో వృద్దులను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రపంచ పెద్దల దినోత్సవం సందర్భంగా వృద్దులను సన్మానించడం అభినందనీయమన్నారు. ఇంటి పెద్ద దిక్కులు, ఎంతో అనుభవాలతో జీవితాలను గడిపిన వారని, మనం వారిని గౌరవవించుకోవల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరు వారి తల్లిదండ్రులను వృద్ధాప్య దశలో పసి పిల్లలాగా చూసుకోవాలని, వారి అలన పాలన భారం కాకూడదని, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కు వారి చివరి దశలో సేవలు చేస్తూ వారిని కంటికి రెప్పల చూసుకోవాలని, వృద్ధాశ్రమల సంఖ్యను తగ్గించాలని, వృద్దులు వయసు అయిపోయిందనే భావన లేకుండా మనవళ్లు, మనవరాలతో కాసేపు ఆట పాటల తో సేద తిరుతూ కాలక్షేపం చేయాలని , ఆరోగ్య పరిరక్షణకు యోగ , ధ్యానం చేయాలని సూచించారు.
అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ సంఘాల సమాఖ్య – కూకట్ పల్లి చాప్టర్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ కాలనీ సెక్రటరీ నర్సయ్య, సీనియర్ సిటిజన్స్ సంఘాల సమాఖ్య – కూకట్పల్లి చాప్టర్ అడ్వైజర్ పాండురంగ రెడ్డి, అధ్యక్షులు రామచంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులు డి కే ప్రసాద రావు, ఉమామహేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి జి.ఎస్.శర్మ , జాయింట్ సెక్రటరీ బసవ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాఘవేంద్రరావు, కోశాధికారి వేదమూర్తి , కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.