నమస్తే శేరిలింగంపల్లి : ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత , సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయ నగర్ కాలనీలోని పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, GHMC , జలమండలి అధికారులు, కాలనీ వాసులతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ జయ నగర్ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను , సమస్యలను పరిగణలోకి తీసుకొని కాలనీలో పాదయాత్ర చేపట్టామని తెలిపారు. కాలనీలో నెలకొన్న ఔట్ లెట్, డ్రైనేజి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. ప్రతి మ్యాన్ హోల్ ను సరి చేసుకుంటూ.. అందులో పేరుకుపోయిన చెత్త చెదారంను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. కమర్షియల్ భవనాలు, హోటళ్లు, హాస్టళ్లు తప్పనిసరిగా సిల్ట్ ఛాంబర్ కట్టుకోవాలని లేకుంటే కూరగాయలు, చెత్త చెదారం పైప్ లైన్ లలో పేరుకుపోయి, డ్రైనేజి పొంగి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సూచించారు. ప్రతి ఒక్కరు సిల్ట్ ఛాంబర్ లను నిర్మించుకోవాలని, అధికారులు దీని పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. వర్షకాలం సమయంలో వర్షపు నీరు నిలబడి రోడ్లు మీద రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని కాలనీ వాసులు ఆయన దృష్టికి తేవడంతో వెంటనే స్పందించారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, వర్షకాలం లో కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు, విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు AE సుభాష్, జలమండలి DGM వెంకటేశ్వర్లు , ఆల్విన్ కాలనీ డివిజన్ తెరాస ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, జయ నగర్ కాలనీ వాసులు శ్రీనివాస్, విష్ణు, కిలారు శ్రీనివాస్, శివారెడ్డి, సుశీల్ కుమార్, దయాకర్ రెడ్డి, రాజ్యలక్ష్మి, రోజారమని, మల్లికార్జున్, శ్రీనివాస్, వెంకటేశ్వర రెడ్డి, కృష్ణారావు, మురళి, శ్రీధర్, రామకృష్ణారెడ్డి, జేవీ రావు, కాలనీవాసులు పాల్గొన్నారు.