ప‌ట్టుభ‌ద్రులు విధిగా ఓటు న‌మోదు చేసుకోవాలి: జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

గోకుల్ ప్లాట్స్ ప‌ట్ట‌భ‌ద్రుల‌కు ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మ‌దాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని గోకుల్ ప్లాట్స్ వెంక‌ట‌ర‌మ‌ణ కాల‌నీలో స్థానిక కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ ఆద్వ‌ర్యంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కాల‌నీలోని ప‌ట్ట‌భ‌ద్రుల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వేయాల్సి ఓటు విలువ గురించి కార్పొరేట‌ర్ వివ‌రించారు. డిగ్రీ పూర్తి చేసిన ప్ర‌తి ఒక్క‌రు విధిగా త‌మ ఓటు హ‌క్కును న‌మోదు చేసుకోవాల‌ని, రానున్న గ్రాడ్జ్యూయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓర్టు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. ఓటు హ‌క్కు న‌మోదు చేసుకునేందుకు వీలుగా ఫామ్ 18 ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గోకుల్ ప్లాట్స్ కాల‌నీ సంక్షేమ సంఘం స‌భ్యులు, స్థానిక ప‌ట్ట‌భద్రులు పాల్గొన్నారు.

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here