శేరిలింగంప‌ల్లిలో ఉత్సాహంగా బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ

  • ప‌లు డివిజ‌న్ల‌లో చీర‌ల‌ను పంపిణీ చేసిన ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, పాల్గొన్న కార్పొరేట‌ర్లు 

శేరిలింగంప‌ల్లి (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో శ‌నివారం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అంద‌జేసిన బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాలు ఉత్సాహంగా సాగాయి. ప‌లు డివిజ‌న్ల‌లో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ ఆయా డివిజ‌న్ల కార్పొరేట‌ర్ల‌తో క‌లిసి మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేశారు.

శేరిలింగంప‌ల్లి డివిజ‌న్‌లో…

పాపిరెడ్డి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, డీసీ వెంకన్న, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ ప్రభుత్వ పాఠశాల, లింగంపల్లి గ్రామంలో డీసీ వెంకన్న, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ల‌తో కలిసి లబ్ధిదారులకు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవోహెచ్‌ రంజిత్, డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు కొండల్ రెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, పొడుగు రాంబాబు, పద్మారావు, చింతకింది రవి కృష్ణ యాదవ్, దేవులపల్లి శ్రీను, శ్రీనివాస్, నటరాజు, వేణుగోపాల్ రెడ్డి, రమేష్, మహేష్ యాదవ్, బసవయ్య యోగి, శ్రీకళ, కవిత, సౌజన్య, జ్యోతి, శశికళ, రమ, నవ్య తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ డివిజ‌న్‌లో…

శ్రీరామ్ నగర్ ఎ బ్లాక్ లో బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, డీసీ వెంకన్న, కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఎ బ్లాక్ లో డీసీ వెంకన్న, కార్పొరేటర్ హమీద్ పటేల్ ల‌తో కలిసి లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవోహెచ్‌ రంజిత్, మాజీ కార్పొరేటర్ రవిముదిరాజు, డివిజన్ తెరాస అధ్యక్షుడు కృష్ణ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, చాంద్ పాషా, నరసింహ సాగర్, జంగం గౌడ్, రమేష్, బలరాం యాదవ్, తిరుపతి రెడ్డి, తిరుపతి, శ్రీనివాస్ చౌదరి, భాస్కర్ రెడ్డి, రజినీకాంత్, గఫుర్, భీమిలి శ్రీనివాస్, తిరుపతి యాదవ్, హిమామ్, గణపతి, రవి శంకర్ నాయక్, అన్నం శశిధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శివకుమార్, రమణ, లక్ష్మి నారాయణ, కుమార్, కృష్ణ సాగర్, నిర్మల, గౌరీ, రూపారెడ్డి, అడ్వకేట్ కృష్ణవేణి, చంద్రకళ, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, వరాలు, సరస్వతి, సయ్యద్ ఉస్మాన్, ఓబుల్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, మల్లేష్, చంద్రమౌళి, కత్తుల శ్రీనివాస్, సందీప్, డా రమేష్, సత్యం, హనుమంతు, అంజాద్ అమ్ము, దీపక్, రఫీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో…

రాయదుర్గం అంబెడ్కర్ కమ్యూనిటీ హాల్ లో బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్ సాయిబాబా

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం అంబెడ్కర్ కమ్యూనిటీ హాల్ లో కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవోహెచ్‌ రంజిత్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు రాజు నాయక్, శేరిలింగంపల్లి డివిజన్ తెరాస అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్, వార్డ్ మెంబెర్ నరేష్, జంగయ్య యాదవ్, సత్యనారాయణ, సతీష్, జగదీష్, అంజమ్మ, రామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

కూక‌ట్‌ప‌ల్లిలో…

ఆస్బెస్టాస్ కాలనీ మోడల్ మార్కెట్ లో బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ

కూకట్‌ప‌ల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, మోడల్ మార్కెట్ లో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాసులు, మాజీ కార్పొరేటర్ రంగా రావు, వివేకానంద నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్, నాగేశ్వర్ రావు, ఎల్లం నాయుడు, తిరుపతి, అల్లం మహేష్, ఖయ్యుమ్, అబుల్, కృష్ణ ముదిరాజు, భాస్కర్ రెడ్డి, శ్రీ జ్యోతి, పద్మ ,లావణ్య, పద్మ, భూలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

వివేకానంద‌న‌గ‌ర్‌లో…

వెంకటేశ్వర నగర్ కాలనీ పీజేఆర్‌ కమ్యూనిటీ హాల్ లో బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్ లక్ష్మి బాయి

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీ పీజేఆర్‌ కమ్యూనిటీ హాల్ లో కార్పొరేటర్ లక్ష్మి బాయితో కలిసి లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాసులు, మాజీ కార్పొరేటర్ రంగా రావు, వివేకానంద నగర్ డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అభివృద్ధి సంస్థ డైరెక్టర్ భద్రయ్య, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు, అల్లం మహేష్, హరినాథ్, మోజేశ్, సతీష్, చంద్రమౌళి సాగర్, విద్య సాగర్, వెంకటస్వామి సాగర్, రాధాబాయి, విజయ తదితరులు పాల్గొన్నారు.

ఆల్విన్ కాల‌నీలో…

ఆల్విన్ కాలనీ ఫేజ్ – 1 సొసైటీ ఆఫీస్ లో బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

ఆల్విన్ కాలనీ ఫేజ్ – 1 సొసైటీ ఆఫీస్, షంషీగూడ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఏఈ సుభాష్, స్వరూప, డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, రామకృష్ణ దొడ్ల, కాశీనాథ్ యాదవ్, బోయ కిషన్, మున్నా, యాదగిరి, లక్ష్మీ, కుమారి, మంజుల, శిరీష త‌దితరులు పాల్గొన్నారు.

హైద‌ర్‌న‌గ‌ర్‌లో…

రాంనరేష్ నగర్ కమ్యూనిటీ హాల్ లో బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్ జానకి రామరాజు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాంనరేష్ నగర్ కమ్యూనిటీ హాల్, నందమూరి నగర్ కమ్యూనిటీ హాల్ ల‌లో కార్పొరేటర్ జానకి రామరాజుతో కలిసి లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు, డీఈ సత్యనారాయణ, డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు నార్నె శ్రీనివాస్, తెరాస నాయకులు దామోదర్ రెడ్డి, కోనేరు ప్రసాద్, రంగరాయ ప్రసాద్, నాయినేని చంద్రకాంత్ రావు, పోతుల రాజేందర్, వెంకటేష్ యాదవ్, అష్రాఫ్, మురళీధర్, సద్దాం, షరీఫ్ అమీద్, అనిల్, లత‌, విమల, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here