దాత‌లు ముందుకు వ‌చ్చి ర‌క్త‌దానం చేయాలి: ‌ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

హైద‌ర్‌న‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాంనరేష్ నగర్ కమ్యూనిటీ హాల్ లో లయన్స్ క్లబ్ అఫ్ నిజాంపేట్, నిపుణ్ నెట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కార్పొరేటర్ జానకి రామరాజుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శ‌నివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ అఫ్ నిజాంపేట్, నిపుణ్ నెట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. క‌రోనా నేప‌థ్యంలో బ్లడ్ బ్యాంక్ ల‌లో ర‌క్తం నిల్వలు పెంచుకోవడానికి ఇలాంటి శిబిరాలు ఎంత‌గానో ఉప‌యోగప‌డ‌తాయ‌న్నారు. దాత‌లు ముందుకు వ‌చ్చి ర‌క్త‌దానం చేయాల‌న్నారు. అనంత‌రం ర‌క్త‌దాత‌ల‌కు ఆయ‌న ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు నార్నె శ్రీనివాస్, తెరాస నాయకులు రంగరాయ ప్రసాద్, కోనేరు ప్రసాద్, దామోదర్ రెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, పోతుల రాజేందర్, వెంకటేష్ యాదవ్, మురళీధర్, సద్దాం, షరీఫ్ అమీద్, అనిల్, లత‌, విమల స్వప్న తదితరులు పాల్గొన్నారు.

శిబిరంలో ర‌క్త‌దానం చేసిన వారికి ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here