నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను, నిత్యావసర ధరలను అదుపు చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వాలు గద్దె దిగాలని సీపీఐ శేరిలింగంపల్లి మండల కమిటీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సీపీఐ శాఖల మహాసభలను మాదాపూర్ దుర్గం చెరువు వద్ద కె. నరసింహా రెడ్డి అధ్యక్షతన జరిగాయి. మహా సభను ఉద్దేశించి సీపీఐ మండల కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే సామాన్య ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని ఎద్దేవా చేశారు. అధిక ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు పోరాటాలు ఆపమని అన్నారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా కే. చందు యాదవ్, కె నరసింహా రెడ్డిలను, కమిటీ కార్యదర్శులుగా కృష్ణ, సత్యనారాయణను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అంజి, ఎం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.