నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, గుర్జారీ హస్తకళా హాత్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శిల్పారామం గేట్ ఆర్చ్ ముందు కళాకారులు అవార్డు గుజరాత్ చేనేత హస్తకళా కారులతో కలిసి శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు, ఇండెక్స్- సి మార్కెటింగ్ మేనేజర్ డాక్టర్ స్నేహాల్ మక్వాన, డిస్ట్రిక్ట్ యూత్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాసిక్ మక్వాన, పోర్బందర్, శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య ఆధ్వర్యంలో డప్పు కొట్టి మేళా ను ప్రారంభించారు.
దాదాపుగా 70 మంది చేనేత కళాకారులు, 40 దాండియా రాస్ గర్భ కళాకారులు, పేరిణి, కూచిపూడి నృత్య కళాకారులు పాల్గొన్నారు. గుజరాత్ సాంప్రదాయ కల ఉత్పత్తులు పాటల, అజ్రాఖ్ బ్లాక్ ప్రింట్, లేథర్ వర్క్, శాలువాలు, ఆభరణాలు, లిప్పన్, మడ్ ఆర్ట్, అద్దాల బ్లౌజ్ లు, డ్రెస్సెస్, జరీ జర్దోసి, ఛనీయ చోళీ, మెటల్ వర్క్, తదితర హస్తకళలు ఉత్పత్తులు ఎంతగానో సందర్శకులను ఆకట్టుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రం మీద పేరిణి పవన్ కుమార్ శిష్య బృందం ప్రదర్శించిన పేరిణి లాస్యం నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. కిరణ్మయి బోనాల శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం సందర్శకులను ఆకట్టుకుంది. గుజరాత్ రాష్ట్రం నుండి విచ్చేసిన రాస్ గర్భ కళాకారులు ప్రదర్శించిన గర్భ నృత్యం ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంది. జూన్ 12వ తేదీ వరకు నిర్వహించే ఈ గుర్జారీ హస్తకళా హాట్ మేళా సందర్భంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.