నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంచి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారించేందుకు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ ద్యేయం అని, అందులో భాగంగానే మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చెప్పారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో హెచ్ఎండబ్ల్యుఎస్ ద్వారా మంజూరైన రూ.28 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి నెలకొన్న సమస్య మంచినీటి పైపులైన్ నిర్మాణంతో తీరనుందన్నారు. పేదవాడలలో నివసించే ప్రతి ఒక్క వినియోగదారునికి ఉచిత నీటి సరఫరా పథకం లాభాలను వివరించి పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. మంచి నీటి సమస్య తలెత్తకుండా పవర్ బోర్లు ద్వారా కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం నాగప్రియ, మేనేజర్ సుబ్రమణ్యం, హఫీజ్ పెట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పద్మరావు, మోసిన ఉద్దీన్, వెంకటేష్, రాములు, కిశోర్, ప్రసాద్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.