డ్రైనేజీ నిర్మాణం పనులను పరిశీలించిన కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ లో నెలకొన్న ప్రతీ సమస్యను దశల వారీగా పరిష్కరించి ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దేలా కృషి చేస్తామని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాకులో రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆయన సూచించారు. ఆయన వెంట ఈఈ వి. శ్రీనివాస్, డీఈ డి. రమేష్, అసిస్టెంట్ ఇంజనీర్ జగదీష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు అశోక్ సాగర్, గిరి గౌడ్, యాదగిరి, అబేద్ అలీ, వెంకట్ రెడ్డి, సత్తిబాబు, నాయుడు, జహంగీర్ తదితరులు ఉన్నారు.

డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here