నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు శాయశక్తులా కృషి చేస్తామని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్ సీ ఐ కాలనీలో పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఎఫ్ సీ ఐ కాలనీలో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ పరిధిలో డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఈఈ శ్రీకాంతిని, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, కాలనీ వాసులు, సుప్రజ, ఉమకిషన్, శంకర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.