నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం హరి హర డాన్స్ అకాడమీ గురువు అంజు అరవింద్ శిష్య బృందం సభ్యులు భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేశా పంచరత్న కీర్తన, అలరిపు, వర్ణం, పుష్పాంజలి, కావడి చిందు, దేవీస్తుతి, అయిగిరినందిని ,తిల్లాన అంశాలపై కళాకారులు పూజ, ధృతి, శ్రద్ధ, ఐశ్వర్య, శిఖా, ఆశ్రిత, అద్రిత తదితరులు ప్రదర్శించి ఆహుతులను మెప్పించారు.