నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంగన్ వాడీ సెంటర్లకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని, మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అంగన్ వాడీ టీచర్లకు, ఆయాలకు వేతనాలు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్ కాలోనీలో తన స్వంత నిధులతో నిర్మించిన అంగన్ వాడీ భవనాన్ని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. కాలనీ వాసుల సంక్షేమం కోసం భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని, చిన్నారుల కోసం ఈ భవనంలో నూతన అంగన్ వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీబాయితో కలిసి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీబాయి, సూపర్ వైజర్ జ్యోతి శ్రీ, నాయకులు యాదాగౌడ్, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, ఫర్వీన్ బేగం, శ్రీకాంత్, బస్వరాజ్, కె. దివాకర్ రెడ్డి, జమ్మయ్య, రామ్ చందర్, అంగన్ వాడీ టీచర్ నాగరాణి, ఆయా అంగన్ వాడీ టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.