నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తూళ్ల వీరేందర్ గౌడ్ నియామకవడం పట్ల పార్టీ మరింత బలోపేతానికి దోహదపడుతుందని బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్ అన్నారు. తూళ్ల వీరేందర్ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకవడం పట్ల జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో వీరేందర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లోనూ బిజెపి విజయాన్ని కైవసం చేసుకుందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కాషాయ జెండా ఎగరడం తథ్యమన్నారు. బిజెపి అధికార ప్రతినిధిగా తూళ్ల వీరేందర్ నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు, తదితరులు పెద్ద సంఖ్యలో వీరేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు.