నమస్తే శేరిలింగంపల్లి: అసంఘటితరంగ కార్మికులు తప్పనిసరిగా ఈ శ్రమ్ కార్డు కోసం పేరును నమోదు చేయించుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, మొవ్వా సత్యనారాయణ అన్నారు. మియపూర్ డివిజన్ పరిధిలో లక్ష్మీ నగర్ లో ఈ – శ్రమ్ కార్డు నమోదు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్మికుల కోసం ముందు చూపుతో ఈ శ్రమ్ కార్డు ను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదైన కార్మికునికి రూ.2 లక్షల ప్రమాద బీమా, అంగవైకల్యం కలిగితే రూ. లక్ష ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. డివిజన్ వ్యాప్తంగా ప్రతి బస్తీ, కాలనీలు, అపార్ట్మెంట్ లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా చర్యలు చేపడతామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న కార్మికులకు ఈ శ్రమ్ కార్డులను అందజేశారు. అనంతరం మియపూర్ డివిజన్ జనప్రియ అపార్ట్మెంట్స్ లోని సాయిబాబా ఆలయం వార్షికోత్సవంలో పాల్గొని సాయినాథునికి పాలాభిషేకం తో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మానిక్, డిఆర్ కె ప్రసాద్, నరేష్ , నరేందర్ రెడ్డి, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, హరికృష్ణ, సింధు రెడ్డి, విజయేందర్ సింగ్, శివ నాయక్, రఘునాథ్ రెడ్డి, నాగులు, శ్రీధర్ గౌడ్, వినోద్ యాదవ్, గణేష్, శ్రీను జె, మంజుల, రాము, పాపయ్య కాలనీ వాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
