హుక్కాకేఫ్ పై పోలీసు ల దాడి – నలుగురిని అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు

నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హుక్కా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ, లక్ష్మీ నగర్, ఎంఎంఎస్ఆర్ టవర్స్ బిల్డింగ్ ఓపెన్ టెర్రస్ పై స్ట్రోక్స్ కేఫ్ లో నిర్వహిస్తున్న హుక్కా సెంటర్ పై రాయదుర్గం పోలీసులు దాడి చేశారు. మణికొండ స్ట్రోక్స్ కేఫ్ లో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేయగా ఆరోగ్యానికి ప్రమాదకరమైన హుక్కా సేవిస్తూ పలువురు యువతీ యువకులు పట్టుబడ్డారు. ఈ దాడుల్లో 4 గురు నిర్వాహకులను వంగలపాటి అనిల్ కుమార్, చోప్రా రాజు, ధారా సందీప్, ముంతల సాయి ప్రకాష్, అదుపులోకి తీసుకొని హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. హుక్కా కేఫ్ యజమాని సుమన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే కేఫ్ యజమాని ప్రభుత్వ ఉద్యోగి కావడం గమనార్హం.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here