నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి డివిజన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా స్థాపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉండి ఫెడరేషన్ బలోపేతానికి పాటుపడాలని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రెసిడెంట్ వుటుకురి శ్రీనివాస్ గుప్త, లింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎన్. సందీప్, కోశాధికారి నాగ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ముస్త్యల శ్రీనివాస్, కోశాధికారి సీహెచ్ గౌరీ శంకర్ పాల్గొన్నారు.