నమస్తే శేరిలింగంపల్లి: భారత రత్న, గాన కోకిల లతామంగేష్కర్ మృతి దేశ ప్రజలకు తీరని లోటని బిజెపి రాష్ట్ర నాయకులు, జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. అతిథి సహయోగ్ సమితి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ ఎన్ క్లేవ్ లో లతా మంగేష్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం, యువతలో దేశ భక్తిని పెంపొందించడానికి లతామంగేష్కర్ గానం ద్వారా ప్రేరణ ఇచ్చిన మహా గాయకురాలు అని ఆయన గుర్తు చేశారు. సినీ పరిశ్రమలో దేశ భక్తిని పెంపొందించే చిత్రాలు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అతిథి సహయోగ్ సమితి అధ్యక్షుడు అజిత్ కుమార్ సేనాపతి, రాజేశ్ షెట్టి, ప్రకాశ్, జగన్ యాదవ్, రాంబాబు, సోమేశ్వర రావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.