మక్తా మహబూబ్ పేట్ లో పర్యటించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతీ కాల‌నీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పెట్ గ్రామంలో జీహెచ్ఎంసీ, ఆయా శాఖల అధికారులతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, మంచీనీరు, విద్యుత్ దీపాలు తదితర అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. అదేవిధంగా డ్రైనేజీ, రోడ్డు పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని కాంట్రాక్టర్, అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జలమండలి అధికారులు సాయి చరిత, వర్క్ ఇన్‌స్పెక్టర్ రమేష్, ప్రేమ్, లింగయ్య స్థానిక నాయకులు శ్రీధర్ ముదిరాజ్, దయానంద్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, సంతోష్, శేఖర్, రాజేష్ గౌడ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

మక్తా మహబూబ్ పేట లో సమస్యలు తెలుసుకుంటున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here