నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి, ఫ్రెండ్స్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు దుప్పెల్లి వెంకటేశం ముదిరాజ్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వెంకటేశం ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గాంధీ వెంకటేశం ముదిరాజ్ ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఫ్రెండ్స్ కాలనీలో అసోసియేషన్ ఆధ్వర్యంలో జన్మదిన కేకును కట్ చేశారు. కాలనీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నవీన్ పట్నాయక్, ఉపాధ్యక్షుడు ఫసీయుద్దీన్, జాయింట్ సెక్రటరీ నాగార్జున, వేణు, శ్రీధర్, గుడ్ల ధనలక్ష్మి తదితరులు వెంకటేశ్ ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.