అంధ్రప్రభ జోన్ ఇంచార్జీ రాహుల్ కు ప్రభుత్వ విప్ గాంధీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం

నమస్తే శేరిలింగంపల్లి: కూకట్‌పల్లి ఆంధ్రప్రభ దినపత్రిక జోన్ ఇంచార్జీ రాహుల్ మాతృమూర్తి కీ శే ప్రసన్న చిత్రపటానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. రాహుల్ తల్లి ప్రసన్న మృతిచెందడం బాధాకరమని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. దశదినకర్మను పురస్కరించుకుని రాహుల్ , వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. స్వర్గస్తులైన కీశే ప్రసన్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు దామోదర్ రెడ్డి, అనిల్ రెడ్డి, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

కీ శే ప్రసన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here