బసవతారక నగర్ పేదలకు ఎంసీపీఐయూ, బీఎల్ఎఫ్ పరామర్శ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ భూములు బడా సంస్థలకు అప్పగించేందుకే పేదల ఇల్లు కూల్చివేతలు చేపడుతున్నారని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ ఆరోపించారు. గురువారం గౌలిదొడ్డి బసవతారక నగర్ బాధితులను ఎంసీపీఐయూ, బీఎల్ఎఫ్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా తాండ్ర కుమార్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా గౌలిదొడ్డి ప్రాంతంలో ఇల్లు వేసుకొని జీవిస్తున్న పేదల ఇళ్లను కూల్చి వేయడంవ దారుణమని అన్నారు. ప్రభుత్వ భూమిని బడా సంస్థలకు ధారాదత్తం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందన్నారు‌. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ భూములను వేలం పాటలు వేస్తూ ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా తన బినామీలకు ఉచితంగా అంటగట్టడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. పేదలు నివసిస్తున్న ఇండ్లను సైతం ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, ఎలాంటి హెచ్చరికలు చేయకుండా కూల్చివేసి నిరాశ్రయులను చేయడం సరైన పద్దతి కాదన్నారు.

బసవతారక నగర్ బాధితులతో మాట్లాడుతున్న తాండ్ర 

 

పేదలకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఆందోళన కొనసాగిస్తామని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ హెచ్చరించారు. ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులేదనని దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు. వాస్తవంగా ప్రభుత్వానిది కానప్పుడు ఆర్డీఓ సమక్షంలో వందలాది మంది పోలీసులను పెట్టి ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను ప్రజలకు, ప్రజా సంక్షేమానికి వినియోగించాలని, బినామీలకు, పెట్టుబడిదారులకు వినియోగించరాదని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల ఓట్లతో గెలిచి వారి హక్కులను కాపాడాలని, వారి నివాసాలకు భద్రత కల్పించాలని అన్నారు. కూల్చివేసిన స్థలంలో అందరికీ పక్కా ఇల్లు కట్టించాలని, పట్టాలు ఇచ్చి వారికి ఆత్మవిశ్వాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, కుంభం సుకన్య, సిద్ధిరాములు, పల్లె మురళి, మైదం శెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బావతారక నగర్ బాధితులను పరామర్శిస్తున్న ఎంసీపీఐయూ, బీఎల్ఎఫ్ నాయకులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here