అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వ గాంధీ శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో‌ శ్రీ సత్యసాయి ప్రశాంతి పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సత్యసాయి ప్రశాంతి పాఠశాలలో రావులకోల గోవింద్ తండ్రి కీర్తిశేషులు రావులకోల రుక్మయ్య జ్ఞాపకార్థం రూ. 4 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, స్కూల్ స్టాఫ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, టిఆర్ఎస్ యూత్ నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here