ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలి : చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

  • చందానగర్ వార్డు కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి గౌతమి నగర్ లో వార్డు కార్యాలయాన్ని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సందర్శించారు. వార్డు కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ముచ్చటించి, సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు వార్డు కార్యాలయం ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, గురుచరణ్ దుబే, పబ్బా మల్లేష్ గుప్తా, అక్బర్ ఖాన్, నరేందర్ భల్లా, సందీప్ రెడ్డి , పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here