సకల హంగులతో మైత్రీ నగర్ ఫేజ్ -2 పార్క్

  • కాలనీవాసులకు అందుబాటులోకి వాకింగ్ ట్రాక్ , చిల్డర్న్స్ పార్క్ బ్యాడ్మింటన్ కోర్ట్
  • ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మైత్రీ నగర్ ఫేజ్ -2 పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ , చిల్డర్న్స్ పార్క్ (చిన్నారుల ఆట పరికరాలు), బ్యాడ్మింటన్ కోర్ట్ ను కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ట్రాఫిక్ ఏ.సి.పి హనుమంత రావు తో కలిసి ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మైత్రీ నగర్ కాలనీలో అన్ని హంగులతో , సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన పార్క్ లో బ్యాడ్మింటన్ కోర్ట్, చిన్న పిల్లలు సరదా సమయంలో ఆడుకునేందుకు వీలుగా ఆట పరికరాల సముదాయాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు. కాలనీలోని వృద్దులు, పిల్లలు సేద తీరడానికి వీలుగా పార్క్ ను అన్ని హంగుల తో తీర్చిదిద్దారని, కాలనీ వాసులు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాఫిజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, హాఫిజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు వెంకటేష్, శ్రీనివాస్, మైత్రి నగర్ కాలనీ ప్రెసిడెంట్ సుబ్బారావు, సుబ్రమన్నేశ్వర్, CB రెడ్డి, చెన్నారెడ్డి, విశ్వేశ్వర్ రావు , KV ప్రసాద్ రావు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

మైత్రీ నగర్ ఫేజ్ -2 పార్క్ లో వాకింగ్ ట్రాక్ , చిల్డర్న్స్ పార్క్ బ్యాడ్మింటన్ కోర్ట్ లను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ట్రాఫిక్ ఏ.సి.పి హనుమంత రావు
బ్యాడ్మింటన్ కోర్ట్ ప్రారంభం అనంతరం బ్యాడ్మింటన్ చేత బట్టిన ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here