శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 22 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు కట్టమీద పరిసరాలలో ఉన్న చెత్తను సంత్ నిరంకారి మిషన్ ప్రాజెక్ట్ అమృత్ లో భాగంగా స్వచ్ఛమైన జలం స్వచ్ఛమైన మనస్సు అనే నినాదంతో సద్గురు మాతా సుదీక్షా జీ మహారాజ్ ఆదేశాల మేరకు 4వ దశలో నిర్వహిస్తున్న చెరువుల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా చెరువు కట్టమీద పరిసరాలలో ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై సంత్ నిరంకరి చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ గౌడ్, గోపాల్, షౌకత్ అలీ మున్నా, లింగం, సత్తయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.






