నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మండలం లోని బంగారిగడ్డ గ్రామంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, యువ నాయకుడు దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయమే లక్ష్యంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తెరాస పార్టీ కి శ్రీరామ రక్ష అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు కృష్ణ యాదవ్, వాసు దేవరావు, అక్బర్ ఖాన్, గుడ్ల శ్రీనివాస్, మున్నా, రాములు గౌడ్, అగ్రవాసు, నర్సిములు, శంకర్, పృథ్వి రౌతు మోహన్ రావు , అంజద్ పాషా, పవన్, జమ్మయ, సౌజన్య, భాగ్యలక్ష్మి, జయమ్మ పాల్గొన్నారు.