శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 22 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసంను పురస్కరించుకుని హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ లో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లింలకు ఇప్తార్ విందు ఇవ్వడం చాలా అభినందించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్తర్, చాంద్ పాషా, మన్సూర్, రాము, అన్వర్, తైసిన్, కాజా, అజార్, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.






