శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీలో SKM డెవలపర్స్, అగస్త్య హోమ్స్, సంస్కార ప్రాజెక్ట్స్, RK చారిటబుల్ ఆధ్వర్యంలో మమత అకాడమి ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షల క్యాంపు ను స్థానిక నాయకులతో కలసి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఉచిత వైద్య పరీక్షల క్యాంపు ను ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషకరమని, ఈ క్యాంపులో అన్నిరకాల వైద్య, పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పులవల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బండారు మోహన్ ముదిరాజ్, వైద్య శిబిర నిర్వాహకులు, కరిముల్లా, ప్రశాంత్ రెడ్డి, వెంకట రమణ, రామకృష్ణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






