- ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టం ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ నుండి కొండాపూర్ మై హోమ్ మంగళ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్య ఇక తెలిగినట్లే. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాను రైల్వే ట్రాక్ వద్ద ట్రాఫిక్‌ను ఆటోమెటిగ్గా కంట్రోల్ చేసే వ్యవస్థను కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్ , ట్రాఫిక్ ఏ.సి.పి హనుమంత రావు, ట్రాఫిక్ సి.ఐ సుమన్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మంజీరా పైప్ లైన్ రోడ్డు లో వైశాలి నగర్ నుంచి కొండాపూర్ మై హోమ్ మంగళ వైపు వెళ్లే వాహనదారుల ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం శుభపరిణామామని, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వెయిటింగ్ సమస్యకు చెక్, ఇక అంతా ఆటోమెటిక్ అని కూడళ్లలో ట్రాఫిక్ సమస్య కు శాశ్వత పరిష్కారం దిశగా ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను తెచ్చినట్లు చెప్పారు. ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.