డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకంలో అవకాశం కల్పించండి

  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి వినతిపత్రం సమర్పించిన శేరిలింగంపల్లి దివ్యంగుల పట్టణ సమాఖ్య ప్రతినిధులు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి దివ్యంగుల పట్టణ సమాఖ్య ప్రతినిధుల వినతి మేరకు అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు విషయంపై ప్రభుత్వ దృష్టికి, సీఎం కేసీఆర్ దృష్టికి, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. దివ్యంగుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని, వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు ఆసరా పింఛన్ ద్వారా 3,016/- రూపాయల ఇస్తూ వారికి కొండంత అండగా నిలుస్తూ ఇంటి పెద్ద కొడుకుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శేరిలింగంపల్లి దివ్యంగుల పట్టణ సమాఖ్య అధ్యక్షుడు అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడు యం. ఏ సర్తాజ్, ప్రధాన కార్యదర్శి మాణ్యం సాగర్, జాయింట్ సెక్రటరీ సాగర్, కోశాధికారి లింగమ్మ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రేణుక, రాజేశ్వరి, నర్సిములు, సతీష్ కుమార్, తేజ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పిస్తున్న శేరిలింగంపల్లి దివ్యంగుల పట్టణ సమాఖ్య ప్రతినిధులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here