రాజగోపాల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

  • చండూరు మున్సిపాలిటీ భూత్ కో ఆర్డినేటర్ తో సమావేశమైన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపల్ పరిధిలోని భరత్ చంద్ర ఫంక్షన్ హాల్లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా భూత్ కో ఆర్డినేటర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మట్లాడుతూ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర సహా ఇంచార్జి అరవింద్ మినన్, వరంగల్ మాజీ శాసనసభ్యులు చండూర్ మున్సిపల్ ఇంచార్జ్ ధర్మారావు, సహ ఇంచార్జి నాగురాం నామోజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, హైదరాబాద్ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు ఆకుల శ్రీవాని, తోకల శ్రీనివాస్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్, తిరుపతి సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, చండూర్ మున్సిపల్ బీజేవైఎం అధ్యక్షులు, సోమ శంకర్, స్థానిక నేతలు మాదగోని స్వామి, మన్యం ప్రవీణ్, దోటి శివ, సంగెపు సాయి, సోమ రాజు, గండూరి మల్లేష్, పోలింగ్ బూత్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

చండూరు మున్సిపాలిటీ భూత్ కో ఆర్డినేటర్ తో సమావేశమై సూచనలిస్తున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here