ఘనంగా విజయ్ కుమార్ రెడ్డి జన్మదినం.. రక్తదాన శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: ఏబివిపి పూర్వ రాష్ట్ర కార్యాసమితి సభ్యుడు విజయ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా చందానగర్ గాంధీ విగ్రహం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, మారబోయిన రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విజయ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు.

చందానగర్ గాంధీ విగ్రహం వద్ద రక్తదాన శిబిరంలో బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, మారబోయిన రవికుమార్ యాదవ్

ఈ సందర్బంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి అసెంబ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి నాతోపాటు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మరిన్ని జాయినింగ్ కార్యక్రమాలతో పాటు పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా సంస్థాగత నిర్మాణం, యువజన, ప్రజా సమస్యలపై కార్యక్రమాలతో అసెంబ్లీలో ఉన్న నాయకులను, ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కే. రాఘవేందర్ రావు, బీజేవైఎం జాతీయ నాయకులు నరేందర్ రెడ్డి, కసిరెడ్డి సింధు రెడ్డి, రాధా కృష్ణ యాదవ్, చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, ఎల్లేష్, బీజేవైఎం నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు.

తన జన్మదినం సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకుల సమక్షంలో కేక్ కట్ చేస్తున్న ఏబివిపి పూర్వ రాష్ట్ర కార్యాసమితి సభ్యుడు విజయ్ కుమార్ రెడ్డిij
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here