నమస్తే శేరిలింగంపల్లి: గుడిసె వాసులకు న్యాయం చేయాలని సిపిఎం, సిపిఐ ఎం, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. కొండాపూర్ డివిజన్ మజీద్ బండలో నిరుపేదలు నివసిస్తున్న గుడిసెలను ప్రభుత్వ అధికారులు కూల్చివేయడం అన్యాయమన్నారు.
గత 20 సంవత్సరాలుగా పేదలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారని, వారిని ఇక్కడ నుండి తరిమి వేయడం తగదన్నారు. వారికి తగిన న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శేరిలింగంపల్లి నాయకులు కొంగర కృష్ణ, సిపిఐ నాయకులు రామకృష్ణ, ఎంసిపిఐ నాయకులు దశరథ నాయక్, లావణ్య, సుల్తానా బేగం, విమల, శీను, బాలస్వామి పాల్గొన్నారు.